Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `మేజర్`. 2008, 26/11 ముంబై ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.
శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ జూన్ 3న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో అడివి శేష్ బాక్సాఫీస్ వద్ద నయా కలెక్షన్స్ రాబడుతూ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువవుతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.7.12 కోట్ల షేర్ ను సాధించి ఈ చిత్రం.. రెండో రోజు రూ. 6.36 కోట్ల షేర్ ని, రూ. 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వసూల్ చేసి అదరగొట్టింది. ఇక ఏరియాల వారీగా `మేజర్` రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం- 3.37 కోట్లు
సీడెడ్- 0.87 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.98 కోట్లు
ఈస్ట్- 0.65 కోట్లు
వెస్ట్- 0.44 కోట్లు
గుంటూరు- 0.52 కోట్లు
కృష్ణా- 0.50 కోట్లు
నెల్లూరు- 0.35 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ= రూ.7.68 కోట్లు(రూ.12.90 కోట్ల గ్రాస్)
———————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 0.55 కోట్లు
హిందీ+ఇతర భాషలు- 1.05 కోట్లు
ఓవర్సీస్- 4.20 కోట్లు
————————
టోటల్ వరల్డ్ వైడ్= రూ.13.48 కోట్లు (రూ.25.10 కోట్ల గ్రాస్)
————————
కాగా, ఈ చిత్రం తెలుగు వర్షన్ బిజినెస్ రూ. 13 కోట్లు కాగా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 18 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసి రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే.. తొలి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 5.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సరిపోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!