Major: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `మేజర్`. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిది.
మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. టాక్ బాగుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ బిజినెస్ రూ. 13 కోట్లు కాగా వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసి.. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్‌తో బరిలోకి దిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను బద్దలు కొట్టి లాభాల బాట పట్టిన ఈ చిత్రం.. నాలుగో రోజూ మంచి కలెక్షన్స్ రాబట్టి రూ. 2.54 కోట్ల ప్రాఫిట్ తో ముందుకు సాగుతోంది. నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డేలో రూ. 1.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 2.19 కోట్ల షేర్ ని దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `మేజర్` నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం- 5.72 కోట్లు
సీడెడ్- 1.42 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.57 కోట్లు
ఈస్ట్- 1.05 కోట్లు
వెస్ట్- 0.69 కోట్లు
గుంటూరు- 0.82 కోట్లు
కృష్ణా- 0.78 కోట్లు
నెల్లూరు- 0.54 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ= రూ.12.59 కోట్లు(రూ.21.10 కోట్ల గ్రాస్)
———————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 1.35 కోట్లు
హిందీ- ఇతర భాషలు- 2.70 కోట్లు
ఓవర్సీస్- 4.90 కోట్లు
————————
టోటల్ వరల్డ్ వైడ్= రూ.21.54 కోట్లు (రూ.39.50 కోట్ల గ్రాస్)
————————