NewsOrbit
సినిమా

Major: ఏడ్చేసిన “మేజర్” సినిమా డైరెక్టర్..!!

Share

Major: అడవి శేష్ హీరోగా రూపొందిన “మేజర్” నిన్న విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బొంబాయి 26/11 నేపథ్యంలో సందీప్ అనే జవాన్ స్టోరీని ఆధారంగా తీసుకుని తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మేజర్ సినిమా చూసి చాలామంది భావోద్వేగానికి గురి అవుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే దిశగా డైరెక్టర్ శశికిరణ్ పనితనం బాగుంది అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఒరిజినల్ క్యారెక్టర్ సందీప్ తల్లిదండ్రులు కూడా… మేజర్ సినిమా చూసి.. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

major movie director cried about her father

రిలీజ్ అయిన రోజు డైరెక్టర్ హరీష్ శంకర్, డీజే టిల్లు.. ఇంక సినిమాలో నటించిన ప్రకాష్ రాజ్ “మేజర్” సినిమా పై పొగడ్తలు వర్షం కురిపించటం తెలిసిందే. ఇటువంటి తరుణంలో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా డైరెక్టర్ శశికిరణ్… ఒక విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. మేటర్ లోకి వెళితే “మేజర్” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తండ్రి చనిపోయారు అని భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి పాత్రలు చూస్తుంటే ఆడియన్స్ అందరి మాదిరే తనకు కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు.

మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటూ ఉంది. “మేజర్” సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా… చూసిన ప్రేక్షకులు.. సరిహద్దులలో ఉన్న “జవాన్” లపై మాత్రమే కాదు వారి కుటుంబాలపై కూడా గౌరవం చూపించే దిశగా సోషల్ మీడియాలో ఈ సినిమా పట్ల కామెంట్లు చేస్తున్నారు. నిజంగా శశికిరణ్ దర్శకత్వం హృదయాన్ని తాకే రీతిలో దేశం కోసం పోరాడుతున్న జవాన్లపై గౌరవం కలిగించే విధంగా ఉందని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు చివరిలో కంటతడి పెట్టారని.. ప్రేక్షకుని అంత రక్తికట్టించే దిశగా డైరెక్టర్ పనితనం ఉందని సినిమా చూసిన ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.


Share

Related posts

Chiranjeevi – Abijeet : మెగాస్టార్ ను కలిసిన బిగ్ బాస్ విన్నర్…ఎందుకో తెలుసా..?

Teja

RRR: `ఆర్ఆర్ఆర్‌` నుంచి న‌యా అప్డేట్‌.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్‌!

kavya N

క‌న్న‌డ‌నాట `డియ‌ర్ కామ్రేడ్` వివాదం

Siva Prasad