Major: మల్టీ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `మేజర్`. 2008, 26/11 ముంబై ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.
శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుందీప్ బాల్యం, టీనేజ్, ప్రేమలో పడటం, తల్లిదండ్రులతో అనుబంధం, ఆర్మీలో చేరడం, దేశం పట్ల ఆయనకు ఉన్న భక్తి ఇలా ముఖ్యమైన అంశాలను ఈ చిత్రంలో చూపించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సందీప్‌గా అడివి శేష్ అద్భుతంగా నటించాడు.. కాదు కాదు జీవించేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక టాక్ బాగుండటంతో.. ఫస్ట్ డే అడివి శేష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా మాస్ జాతర సృష్టించారు. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.7.12 కోట్ల షేర్ వసూళ్లు సాధించి అదరగొట్టేసింది. ఇక ఏరియాల వారీగా `మేజర్` ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం- 1.75 కోట్లు
సీడెడ్- 0.46 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.51 కోట్లు
ఈస్ట్- 0.34 కోట్లు
వెస్ట్- 0.24 కోట్లు
గుంటూరు- 0.30 కోట్లు
కృష్ణా- 0.28 కోట్లు
నెల్లూరు- 0.19 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ= రూ.4.07 కోట్లు(రూ.6.85 కోట్ల గ్రాస్)
———————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 0.35 కోట్లు
హిందీ- 0.35 కోట్లు
ఓవర్సీస్- 2.35 కోట్లు
————————
టోటల్ వరల్డ్ వైడ్= రూ.7.12 కోట్లు (రూ.13.10 కోట్ల గ్రాస్)
————————
కాగా, ఈ చిత్రం తెలుగు వర్షన్ బిజినెస్ రూ. 13 కోట్లు కాగా వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 18 కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడీ చిత్రం క్లీన్ హిట్‌గా నిలవాలంటే.. తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.11.88 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.