Major Trailer: విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు చేరువైన యంగ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు `మేజర్`తో అందరి ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు.
ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రతో అడివి శేష్ అలరించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ టైలర్‌ను బయటకు వదిలారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`బోర్డర్ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ లోకి వెళ్లాడమేంటి?.. సందీప్ అది వాళ్ళది` అని సుపీరియర్ ఆఫీసర్ అంటుంటడగా.. `అది కూడా మనదే కదా సార్` అని అడివి శేష్ చెప్పడంతో మొదలైన ఈ ట్రైలర్ ఆధ్యంతం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో శేష్ తన పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యాన్ని, యవ్వనాన్ని, ఆర్మీలో చేరాలన్న బలమైన కోరిక, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలను ఈ ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ట్రైలర్‌ను వీక్షించిన నెటిజన్లు ఆడివి శేష్‌కు హిట్ ఖాయమంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.