Major: కరోనా గడ్డుకాలం తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వాలు జీవోలు జారీచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం కొన్ని సినిమాలకు బాగా వర్కవుట్ అయింది. కానీ మరికొన్ని సినిమాలకు కాస్త శాపంగా మారింది. ఈ రేట్లు సామాన్యుల జేబులకు చిల్లులు పడే రేంజ్ లో ఉన్నాయనే కామెంట్స్ బయట బాగా వినబడ్డాయి. దాంతో ఇటీవల వచ్చిన పెద్ద సినిమాలకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇది గమనించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ‘ఎఫ్ 3’ చిత్రాన్ని మల్టీప్లెక్స్ లలో 250 + జీఎస్టీ.. నార్మల్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి 250 గా, సింగల్ స్క్రీన్ లలో 150 + జీఎస్టీ మరియ రూరల్ ఏరియాల్లో జీఎస్టీతో కలిపి 150 రూపాయలుగా రేట్లు నిర్ణయించారు.
‘ఎఫ్ 3’ పాటించిన సూత్రాన్నే ”మేజర్” మూవీ వారు పాటించబోతున్నారు. జూన్ 3న విడుదల కాబోతోన్న ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ రేట్లు పెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో’ అంటూ ‘ఎఫ్ 3’ టీమ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే.. ‘మేజర్’ మేకర్స్ కాస్త వినూత్నంగా ఏకంగా టికెట్ ధరలను పోస్టర్లలో వేయడం కొసమెరుపు. ”మేజర్” సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లలో రూ.150 – మల్టీఫ్లెక్స్ లలో రూ.195 గా టికెట్ రేట్లు ఉన్నాయి. ఇక APలో సింగిల్ స్క్రీన్ లలో రూ.147 – మల్టీఫ్లెక్స్ లలో రూ.177 గా ధరలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో GST తో కలిపే ఈ రేట్లకు ఫిక్స్ చేయడం విశేషం.
ఇక ఈ విషయాన్ని హీరో అడివి శేష్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ”అత్యంత సరసమైన ధరలలో ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ‘మేజర్’ కోసం అతి తక్కువ ధరలు నిర్ణయించాం. ఇవి పాండమిక్ తర్వాత ఏదైనా సినిమాలలో అత్యల్పం!” అంటూ పేర్కొన్నారు. ఇకపోతే ”మేజర్” అనే సినిమా 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. తెలుగు మలయాళ హిందీ భాషల్లో జూన్ 3న ఈ బయోపిక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…