Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” సినిమా చేయడం తెలిసిందే. జనవరి 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ నటించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు చిరంజీవి, రవితేజ లకి సంబంధించిన టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి లుక్ అప్పట్లో ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్… ఘరానా మొగుడు తరహాలో ఉంది. లుంగీ కట్టి నోటిలో బీడీ పెట్టుకోవడంతో.. పాటు చేపలు పట్టే తరహాలో సినిమా పోస్టర్ లు…ఉండటంతో..మాస్ ఫ్లేవర్ కంటెంట్ కలిగిన సినిమా అని అంటున్నారు. రవితేజ క్యారెక్టర్ కి సంబంధించి రిలీజ్ అయిన వీడియోలో పవర్ ఫుల్ గా చూపించడంతో.. “వాల్తేరు వీరయ్య” ఎంతటి ఘన విజయం సాధిస్తుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

బాస్ పార్టీ సాంగ్ తో పాటు… మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 26వ తారీకు “వాల్తేరు వీరయ్య” టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్.. పోస్టర్ రిలీజ్ చేయడం మాత్రమే కాదు.. పూనకాలు లోడింగ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా..లో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఒక్కరోజు గ్యాప్ లో “వాల్తేరు వీరయ్య”.. బాలకృష్ణ “వీరసింహారెడ్డి” సినిమాలు సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండిటిలో ఏది పై చేయి సాధిస్తుందో ఆసక్తికరంగా మారింది.