Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వచ్చిన కథతోనే పెద్ద సాహసం చేశాడని చెప్పాలి. టాలీవుడ్లో మాత్రమే కాకుండా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు సినిమా, పూరి జగన్నాథ్ – మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్లో వచ్చిన అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి కూడా బాక్సింగ్ కథా నేపథ్యంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఇప్పుడు కూడా ఇదే కథా నేపథ్యంలో రెండు సినిమాలొస్తున్నాయి.
ఒకటి వరుణ్ తేజ్ నటిస్తున్న గని, మరొకటి పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న లైగర్. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కుమారుడు అల్లు బాబి తన స్నేహితుడు సిద్దు ముద్ద తో కలిసి నిర్మించారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యీటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. థమన్ సంగీతం అందించాడు. తమన్నా స్పెషల్ సాంగ్‌లో అలరించబోతుంది. అయితే, ఈ సినిమా ఇప్పటికే 7 సార్లు విడుదల తేదీ కన్ఫర్మ్ చేసి వాయిదా వేశారు.
Ghani: ఒకే శరీరాకృతిని మేయింటైన్ చేయాలంటే చాలా కష్టం.
అదే ఒక నెగిటివ్ సెంటిమెంట్‌గా మారింది. ఇండస్ట్రీలో రెండుసార్లు రిలీజ్ పోస్ట్‌పోన్ అయితేనే సినిమాపై పలు సందేహాలు వ్యక్తమవుతాయి. ఆ సినిమా ఫ్లాప్ అని వార్తలు ప్రచారం అవుతాయి. అలాంటిది ఇప్పటికే చాలాసార్లు వచ్చిన కథ..అందరూ చూసిన కథ..అలాంటి కథతో వస్తున్న గని చిత్రానికి వాయిదాల పర్వం..కొత్త దర్శకుడు..ఇలా కారణాల వల్ల వరుణ్ తేజ్ మాత్రమే కాకుండా చిత్రబృందం కూడా కాస్త టెన్షన్లో ఉన్నారట. అయితే, సినిమాకు కలిసిచ్చే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ ఈ సినిమా కోసం పడిన కష్ఠం పోస్టర్స్‌లోనే తెలిసింది. దాదాపు మూడేళ్ళు ఒకే శరీరాకృతిని మేయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కథలో దమ్ముంది కాబట్టే మేకర్స్ రిజల్ట్ విషయంలో ధైర్యంగా ఉన్నారట.