MEGA 154: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో “ఆచార్య” విడుదలవగా అట్టర్ ఫ్లాప్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి నటించిన భారీ అంచనాలు నెలకొనగా.. ఏమాత్రం అంచనాలను రీచ్ కాలేకపోయింది. “ఆచార్య” డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Chiru- Salman: మెగాస్టార్ చిరంజీవికి కండిషన్ పెట్టిన సల్లు భాయ్.. అలా అయితేనే ఆ మూవీ చేస్తాడట!
ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇంకా బాబీ దర్శకత్వంలో “MEGA 154” అనే వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమా చేస్తున్నారు. ఈ మూడింటిలో “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తారీకు “గాడ్ ఫాదర్” రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా “MEGA 154” సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ మేకర్స్ ఇచ్చారు. కొత్తగా షెడ్యూల్ మొదలైంది ఇందులో చిరంజీవితో పాటు సినిమాకి సంబంధించి ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నాం.
Mega 154: `మెగా 154`లో చిరు పాత్ర లీక్.. ముచ్చటగా మూడోసారి అలా చేస్తున్నారా?
హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో చిరంజీవిని మునిపెన్నడు చూడని మాస్… పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ రవితేజ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ పెట్టి ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. దసరా పండుగ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.