malavika mohanan: ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టమని చెబుతోంది మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్. కేరళలో పుట్టి, ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. రజనీకాంత్ తో `పేట`, ధనుష్ సరసన `మారన్`, విజయ్ దళపతికి జోడీగా `మాస్టర్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గైంది.
మరవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫొటో షూట్లతో నెటిజన్లకు మత్తెక్కిస్తుంటుంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో ముచ్చట్లు పెట్టే ఈ భామ.. ఇటీవల `ఆస్క్ మాళవిక` పేరుతో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో ఆమె సమాధానాలు ఇచ్చింది.
ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. `టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ అంటే నాకు పిచ్చ ఇష్టం. బాహుబలి రెండు చిత్రాలను పదిహేను సార్లకు పైగా చూసి ఉంటా. ఛాన్స్ వస్తే ప్రభాస్ సినిమాను అస్సలు వదులుకోను` అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే కన్నడ స్టార్ యశ్ గురించి మాళవికా మాట్లాడింది.
`కేజీఎఫ్ విడులకు ముందు నుంచీ యశ్‌కు నేను వీరాభిమానిని. ఏదో ఒకరోజు ఆయన ఉన్నత స్థాయికి చేరుకుంటారని అనుకున్నా. అదే జరిగింది. ఆయన లైఫ్‌స్టోరీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయనతో కూడా కలిసి నటించాలనుంది` అని పేర్కొంది. దీంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ స్టార్ హీరోలపైనే మాలవికా కన్నేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్‌లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…