Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`ను పూర్తి చేసిన చిరంజీవి.. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాడర్`ను పట్టాలెక్కించాడు. ఇది సెట్స్ మీద ఉండగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్`, బాబీ డైరెక్షన్లో `మెగా 155`ను ప్రారంభించాడు.
ఇక ఈ చిత్రాలన్నీ పూర్తి కాకుండానే.. చిరంజీవి తన 156వ సినిమాను ఈ మధ్యే ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుములతో ప్రకటించాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో త్రిష్ హీరోయిన్గా నటించబోతోందంటూ మొదట ప్రచారం జరిగింది.
ఆ తర్వాత త్రిష కాదు శ్రుతి హాసన్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. మాస్టర్ సినిమాలో విజయ్ దళపతి సరసన నటించి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. వెంకీ తెరకెక్కించబోయే చిత్రంలో చిరంజీవితో రొమాన్స్ చేసేదే మాళవికనే అంటూ ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇప్పటికే మేకర్స్ మాళవిక ను సంప్రదించారని.. ఆమె వెంటనే ఓకే చెప్పిందని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే.. చిరంజీవి, మాళవికల మధ్య కెమిస్ట్రీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!