విజ‌య్ దేవ‌ర‌తో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌

`డియ‌ర్ కామ్రేడ్` చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నాతో రొమాన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ .. క్రాంతి మాధ‌వ్ చిత్రంలో మ‌రో ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఈ క్రేజీ హీరో బై లింగ్వువ‌ల్ చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌బోయే ఈ చిత్రంలో హీరోయిన్‌గా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌వికా మోహ‌న‌న్ న‌టించ‌నుందని స‌మాచారం. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్ కుమార్తె అయిన మాళ‌వికా మోహ‌న‌న్‌ బాలీవుడ్ చిత్రం `బియాండ్ ది క్లౌడ్స్‌`లో న‌టించింది. విజ‌య్ దేవ‌ర చిత్రం మాళ‌వికా న‌టించ‌బోయే తొలి తెలుగు చిత్రం కానుంది. ఆనంద అన్నామలై ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. క్రాంతి మాధ‌వ్ సినిమాను ముగియ‌క ముందే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు స్టార్ట్ కావ‌డం విశేషం.