మాళవికా శర్మ.. రవితేజ `నేలటిక్కెట్టు`తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకి తొలి చిత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో అవకశాలు కూడా పెద్దగా రాలేదు. దాదాపు ఏడాది తర్వాత మరో తెలుగులో సినిమాలో నటించే అవకాశాన్ని మాళవికా శర్మ దక్కించుకుంది. అది కూడా హీరో రామ్ సరసన. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమాను చేస్తున్నాడు. తమిళ చిత్రం `తడం`కు ఇది రీమేక్. ఇందులో మాళవికా శర్మను హీరోయిన్గా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.
previous post
next post