NewsOrbit
Entertainment News సినిమా

Devara: ఎన్టీఆర్… కొరటాల “దేవర” సినిమాలో మలయాళ నటుడు..!!

Share

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” అనే టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ “దేవర” అని ప్రకటించడంతో… ఫ్యాన్స్ కి బాగా నచ్చటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఎన్టీఆర్ తో సైఫ్ తలపడే సన్నివేశాలు విశాఖపట్నంలో చిత్రీకరించడం జరిగింది.

Malayalam actor in NTR Korat's movie Devara

ఈ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. స్టోరీ ప్రకారం హీరోను మరో ట్రాక్ లో ఎదుర్కొనే మరో విలన్ కూడా ఉండబోతున్నాడట. ఆ పాత్రకి గాను.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను తీసుకోబోతున్నారని సమాచారం. ఇటీవల వచ్చిన “దసరా” సినిమాలో ఆయనే విలన్. నాని కెరియర్ లో “దసరా” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో స్టోరీ పరంగా మంచి పవర్ ఫుల్ విలన్ కావటంతో కొరటాల నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Malayalam actor in NTR Korat's movie Devara

అందాల శ్రీదేవి కూతురు కావటంతో పైగా దక్షిణాదిలో ఇదే మొదటి సినిమా కావటంతో… “దేవర” కి ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది సినిమాలో జాలరి పాత్రలో జాహ్నవి కపూర్ డి గ్లామర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇంకా ఇదే సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారట. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో “దేవర” 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.


Share

Related posts

ఎన్టీఆర్ సినిమాకు టైటిల్ లాక్ చేసిన కొర‌టాల‌.. ఇంత‌కీ ఏంటో తెలుసా?

kavya N

Balayya Boyapati: బాలయ్యతో సీక్వెల్ ప్లాన్ చేసిన బోయపాటి..??

sekhar

సంక్రాంతికి బానే నవ్వించేలా ఉన్నారే…

Siva Prasad