Salaar: “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “సలార్”. “కేజిఎఫ్”, “కేజిఎఫ్ 2” భారతీయ చలనచిత్ర రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. “కేజిఎఫ్ 2” దాదాపు 1000 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. మరో పక్క “బాహుబలి”తో ప్రభాస్ చరిత్ర సృష్టించడంతో… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న “సలార్” పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కి ఒక హిట్ పడలేదు. “సాహో”, “రాదేశ్యామ్” సినిమాలు రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల్లో కంటే ఎక్కువగా “సలార్” పైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు నాడు “సలార్” లో ఆయన లుక్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా ఉంటే తాజాగా “సలార్” పై పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ విజన్ కి.. ఆయన ఈ సినిమా తెరకెక్కిస్తున్న తీరుకు… నేను చాలా ఫిదా అయ్యాను. “సలార్” లో యాక్షన్ ఎపిసోడ్ లు.. ఆడియన్స్ ఊహలకు మించి ఉంటాయి. అసలు ఎవరు కూడా అంతా ఊహించలేరు.
“సలార్”… ఏమాత్రం ఆషామాషీ సినిమా కాదు. నేను అనుకున్న దాని కంటే చాలా భారీ స్థాయిలో సినిమా ఉంది అంటూ పృధ్విరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సలార్” వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కానుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “కేజిఎఫ్” సినిమాలను మించి పోయే రీతిలో…”సలార్” నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్. ఈ సినిమాతో ప్రభాస్ మరో అతిపెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.