దక్షిణాదిలో భాషా సినిమాల్లో కమర్షియల్ స్లాట్ కు మాత్రమే వర్కౌటయ్యేది తెలుగు సినిమాల్లోనే. కానీ.. తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో కమర్షియల్ తోపాటు కథ, ఆర్ట్, క్లాస్, ట్రాజెడీ.. కథాంశాలు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ప్రేక్షకాదరణ కూడా ఎక్కువే. ముఖ్యంగా కథ, కథనంలో వారు పెట్టే దృష్టి ఆశ్చర్యం కలిగిస్తాయి. అందుకే.. జాతీయ, అంతర్జాతీయ, సీనీ.. అవార్డులకు ఎక్కువగా ఆ భాషల సినిమాలే దక్కించుకుంటాయి. 2019లో మళయాళంలో ఆ తరహాలో వచ్చిన సినిమానే ‘జల్లికట్టు’. ఎద్దుల పోటీల నేపథ్యాన్ని కాస్త భిన్నంగా తీసుకుని మళయాళంలో తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా భారత్ తరపున అస్కార్ నామినేషన్ లో నిలవడం విశేషం
లిజో జోస్ పెల్లిస్సరీ దర్శకత్వంలో అంటోనీ వర్గీస్ హీరోగా నటించిన ఈ సినిమాలో కథ, కథనం ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలోని ఊళ్లో బీఫ్ సరాఫరా చేస్తాడు హీరో. దానికోసం ఊరి జనం ఎదురుచూస్తూ ఉంటారు. ఓసారి ఓ అడవి దున్నను తీసుకొచ్చి నరికే సమయంలో తన పశుబలంతో తప్పించుకుంటుంది. ఊరిపై పడి పదునైన కొమ్ములతో ప్రజలను వణికిస్తూ పంట, ఆస్తి నష్టం కలుగజేస్తుంది. దీంతో ఊరంతా అడవి దున్నను పట్టుకోవడంలో నిమగ్నమైపోతారు. పూర్తిగా అటవీ నేపథ్యం, రాత్రివేళల్లో చిత్రీకరణ, పశువును పట్టుకునే క్రమంలో ప్రజల ప్రవర్తన.. వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆదిమానవవుల కాలంలో ఉన్నామా అనే ఓరకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. దీంతో అద్భుత విజయం సాధించి విమర్శకలు ప్రశంసలు అందుకుంది.
‘జల్లికట్టు’ను ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. దేశంలోని 27 సినిమాలు పోటీలో నిలవగా ఈ సినిమాను ఎంపిక చేసింది. ఇప్పటికే టొరంటో, బూసన్ ఫిల్స్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది. దేశీయంగా పలు అవార్డులు దక్కాయి. ఇటువంటి కథాంశాన్ని తెరకెక్కించడం కష్టమైన విషయమే. కానీ.. అనుకున్నది తెరపై తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇండియా నుంచి ఇప్పటివరకూ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాల సరసన ‘జల్లికట్ట’ చేరింది. ఆస్కార్ వేదికపై ఉత్తమ విదేశీ చిత్రంగా ఉన్న కేటగిరీ.. గత ఏడాది నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మారింది. మరి ‘జల్లికట్టు’ ఏం చేస్తుందో.!