Cinema Chance:సినిమా ఛాన్స్ కోసం తమ్ముడు చెత్త సలహా..అన్న చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు!

man-cuts-his-throat-to-get-chance-in-movies-by-listening-to-his-brother
Share

Cinema Chance: సినిమాలలో నటించాలనే కల చాలా మందికి ఉంటుంది. అయితే ఆ కల కొందరికి నెరవేరుతుంది. మరికొందరికి తీరని కలగానే మిగిలిపోతుంది. మరికొందరు తమ ప్రయత్నాలను వదలకుండా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు తగ్గించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. షార్ట్ ఫిలిమ్స్ తీయడం, యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేయడం, టిక్ టాక్ వంటి వాటి ద్వారా తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తారు. వీటి ద్వారా పాపులర్ అయి సినిమా అవకాశాలు దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారు.

man-cuts-his-throat-to-get-chance-in-movies-by-listening-to-his-brother
man-cuts-his-throat-to-get-chance-in-movies-by-listening-to-his-brother

ఇలాంటి నేపథ్యంలోనే తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరుకు చెందిన మారిముత్తు ఓ ప్రైవేటు ఉద్యోగి. అతని తమ్ముడు చాలా కాలంగా చెన్నైలో ఉంటూ సినిమాలు చేస్తున్నాడు.ఈక్రమంలోనే తనకి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది.ఈక్రమంలోనే సినిమా అవకాశాలు రావాలంటే ఏం చేయాలని తన తమ్ముడు ను సలహా అడిగాడు. అందుకుగాను తన తమ్ముడు చెప్పిన ఓ చెత్త సలహా అతని ప్రాణాలు మీదకు వచ్చింది.

సినిమా అవకాశాలు:

మారిముత్తుకి సినిమా అవకాశాలు రావాలంటే గదిలోకి వెళ్లి గొంతు కోసుకున్నట్లు వీడియో తీసి పోస్ట్ చేయడం ద్వారా సినిమా అవకాశాలు వస్తాయనే చెత్త ఐడియా ఇచ్చాడు. దీంతో ఆ అన్న నిజంగానే గదిలోకి వెళ్లి తన గొంతు కోసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికి బయటకు రాకపోగా తలుపుతట్టిన తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పెద్ద గాయం కాకపోవడంతో అతని ప్రాణాలతో బయటపడ్డాడు. ఏం జరిగిందని అన్న ను పోలీసులు అడగగా అందుకు అతను జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అన్నదమ్ములను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్ళడం మీద రగిలిపోతున్న జబర్దస్త్ హైపర్ ఆది ??

sekhar

Pawan Kalyan: రానా సినిమాలో తనకు ఇష్టమైన యాక్టర్ ని పెట్టుకున్న పవన్ కళ్యాణ్..??

sekhar

బ్రేకింగ్: నితిన్ కు కలిసి అభినందించిన పవన్, త్రివిక్రమ్

Vihari