Manchu Lakshmi: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి గురించి పరిచయాలు అవసరం లేదు. మొదట హాలీవుడ్‌లో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి.. సిద్దార్థ్ హీరోగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. మంచు లక్ష్మి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈ భామ వరుస సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది.
ప్రస్తుతం ఈమెకు తెలుగులో సినిమాలేమి లేకపోయినా.. మలయాళ, తమిళ భాషల్లో మాత్రం రెండు, మూడు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ బాక్సర్‌గా అవతారమెత్తింది. మాంచి ఫిట్నెస్ ఫ్రీక్ అయిన మంచు లక్ష్మి.. తాజాగా బాక్సింగ్ చేస్తూ జిమ్‌లో చెమటలు చిందించింది.
ట్రైనర్ పర్యవేక్షణలో ఈమె పంచ్‌ల మీద పంచ్‌లు విసురుతూ అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. లేటు వయసులోనూ ఫిట్నెస్ పట్ల మంచు లక్ష్మికి ఉన్న డెడికేషన్ చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
https://www.instagram.com/reel/CZrN9zKAoK_/?utm_source=ig_web_copy_link
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…