Agni Nakshatram: విలక్షణ నటుడు మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఎప్పుడు ప్రయోగాత్మకమైన.. సవాలతో కూడిన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలం నుండి .. మంచు లక్ష్మి నుండి సినిమాలు ఏవి రాలేదు. కానీ ఆమె బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తోంది. అయితే ఇటువంటి తరుణంలో తాజాగా తండ్రి మోహన్ బాబుతో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మంచు లక్ష్మి సినిమా చేస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా మంచు లక్ష్మి సంచలన కామెంట్ చేయడం జరిగింది. ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను అంటూ తన తండ్రితో “అగ్ని నక్షత్రం”(Agni Nakshatram) అనే సినిమా చేస్తున్నట్లు తెలిపింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాకి ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మి బ్యానర్ పై తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు లక్ష్మి ఈ సినిమా నిర్మాణ భాగంలో కూడా పాలు పంచుకుంటుంది. ఈ క్రమంలో అగ్ని నక్షత్రం చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ లో పోలీస్ వాహనం హారన్ మోగిస్తూ చూపించారు. దీంతో ఈ సినిమా పోలీస్ స్టోరీ తో కూడిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతుంది.
అంత మాత్రమే కాదు మోహన్ బాబు మంచు లక్ష్మి ఈ సినిమాలో ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. “పిట్ట కథలు” అనే వెబ్ సిరీస్ తర్వాత మంచు లక్ష్మి చేస్తున్న సినిమా ఇదే. ఇక “సన్ అఫ్ ఇండియా” తరువాత మోహన్ బాబు నటించిన సినిమా కూడా ఇదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.