Manchu Manoj: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కుటుంబాలలో మంచు ఫ్యామిలీ ఒకటి. సినిమాల పరంగా ఇంకా రాజకీయపరంగా కూడా ఎంతో పేరు ఉంది. మోహన్ బాబు తెలుగు రాష్ట్రాలలో అంతగా పేరు సంపాదించారు. ఆయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇద్దరిలో మంచు విష్ణు బాగా క్లిక్ చేయరు ప్రస్తుతం సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. కానీ దాదాపు నాలుగు సంవత్సరాలు నుండి మంచు మనోజ్ ద్వారా ఒక సినిమా రాలేదు. “అహం బ్రహ్మాస్మి” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించిన ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు.
2015వ సంవత్సరంలో.. మంచు మనోజ్ కి ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో వివాహం జరిగింది. తర్వాత 2019వ సంవత్సరంలో ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దాదాపు కొద్ది నెలల నుండి వీరిద్దరూ కలిసే ఉంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో పలు సందర్భాలలో… కూడా మీడియా ముందు కనిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు భూమా మౌనిక రెడ్డి తో మార్చి మూడవ తారీకు మంచు మనోజ్ పెళ్లికి రెడీ అయినట్టు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఓ కార్యక్రమం మంచు మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న నివాసంలో జరిగినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నేపథ్యంలో రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డికీ కూడా గతంలోనే పెళ్లి జరిగి విఫలమయింది. ఇద్దరి గత జీవితాలలో విడాకులు రావడంతో ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితానికి ఒకటవటానికి పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. కొన్ని వారాల క్రితం త్వరలో శుభవార్త అనే పోస్ట్ మంచు మనోజ్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ పోస్ట్ పెట్టి చూస్తే పెళ్లి గురించే అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. మూడో తారీకు పెళ్లి ఉందని తెలుస్తుంది కానీ ఎక్కడ ఎలా ఎవరెవరు…ఈ వేడుకకు వస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.