మంచు మనోజ్‌కుమార్ తన సపోర్ట్‌ను జనసేన పార్టీకంటూ క్లారిటీ ఇచ్చారు. తండ్రి మంచు మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతారు అని అందరూ అనుకున్నారు. అయితే ట్విట్టర్లో అభిమానులతో మాట్లాడిన మంచు మనోజ్ రాబోయే ఎన్నికల్లో తన మద్దతు జనసేన పార్టీకే ఉంటుందని తెలియజేశారు. ఐదు, పదేళ్ల తర్వాత మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. `ఇంకెవరికి? ఆయనకే. ఆయన రాజకీయాల్లోకి వస్తే అంతకంటే ఏం కావాలి.. తారక్ వస్తే నేను ఎటు వెళ్తాను తమ్ముడు.. తారక్ రాక కోసం ఎదురు చూస్తున్నా.. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు` అని బదులిచ్చారు మంచు మనోజ్.
previous post