Manchu Manoj: మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ రెండో వివాహానికి రెడీ అయిపోయారు. గత కొద్ది రోజుల నుండి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ నేపధ్యం కలిగిన భూమ ఫ్యామిలీకి చెందిన మౌనికతో గత కొద్ది నెలల నుండి మంచు మనోజ్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరికీ కూడా గతంలోనే పెళ్లయి విడాకులు కూడా కావడం జరిగింది. దీంతో ఇప్పుడు కొత్త జీవితానికి శ్రీకారం పెట్టడానికి రెడీ అయ్యారు. మార్చి మూడవ తారీకు మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో రాత్రి 8:30 గంటలకు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి… మంచు మనోజ్ రెడీ కావడం జరిగింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు కొంతమంది మాత్రమే హాజరవుతారని సమాచారం.
ఆల్రెడీ మెహందీ కార్యక్రమం జరిగింది. నేడు సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి లక్ష్మీప్రసన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. 2015 లోనే మంచు మనోజ్ కి పెళ్లయింది. పెళ్లయిన కొన్నాళ్ళు బాగానే ఉన్నా గాని నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు భూమా మౌనికతో రెండో పెళ్లికి సిద్ధమవటం సంచలనంగా మారింది. దాదాపు సంవత్సరం పైగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. చాలా సందర్భాలలో మీడియా ముందు కూడా దర్శనమివ్వడం జరిగింది. గత ఏడాది వినాయక చవితి పండుగ సమయంలో హైదరాబాదులో ఓ మండపానికి కూడా కలిసి వచ్చారు.
అయితే కొన్ని వారాల క్రితం త్వరలో శుభవార్త అంటూ మంచు మనోజ్ పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో మళ్ళీ సినిమాలు చేయటానికి మనోజ్ రెడీ అయినట్లు అందరు భావించారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉండటంతో పెళ్లి గురించి ఆ పోస్ట్ పెట్టినట్లు భావించడం జరిగింది. మంచు మనోజ్ సినిమా విడుదలయ్యి దాదాపు మూడు సంవత్సరాలు పైగానే అయింది. మధ్యలో కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా గాని షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇదే సమయంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిలో వాస్తవం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతూ ఉండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.