Manchu Vishnu: మా మూవీ ఆర్టిస్టుల ఎన్నికలు ఏ రేంజ్ లో జరుగుతాయనేది వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే మాదిరి ఇపుడు మా మూవీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర రాజకీయాలు కూడా మొన్న రీసెంటుగా జరిగిన ఈ ఎన్నికలలో వేలు పెట్టాయనేది ఓ రూమర్. ఇక వాస్తవం ఆ పెరుమాళ్ళకెరుకగాని, ప్రకాష్ రాజ్ – మంచువిష్ణు ఇక్కడ పోటీ చేయగా కట్ చేస్తే మంచు విష్ణు ప్యానెల్ విజయ కేతనం ఎగుర వేసింది. ఇకపోతే ఇక్కడ ఎవరు గెలవాలన్నా తొలిగా ప్రకటించేది ఆర్టిస్టులకు సొంత భవంతి. ఇక్కడ రాజకీయం అంతా దాని చుట్టూనే తిరుగుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
Manchu Vishnu: మా బిల్డింగ్ నిర్మాణం జరిగేనా?
ఇపుడు ఇదే అనుమానం కొన్నేళ్లుగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. మాకి ఇదివరకు చాలామంది అధ్యక్షులు పని చేసారు. అయితే బిల్డింగ్ నిర్మాణ వ్యవహారం అనేది చాపకింద నీరు మాదిరి సాగుతుంది. అయితే అయితే వీళ్లందరికీ మంచు విష్ణు అతీతుడు కాదా? అన్న చర్చా ఇప్పుడు మొదలయ్యింది. ఎందుకంటే, మా బిల్డింగ్ నిర్మాణం జరిగి తీరుతుందని గప్పాలు కొట్టి ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు గెలిచి, రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం పునాది వేసిన పాపాన పోలేదని కొన్ని రూమర్స్ టాలీవుడ్లో వినబడుతున్నాయి. ఈ యువ అధ్యక్షుడి ప్రకటన కూడా మరో రాజకీయ నాయకుడి ప్రకటనలా నీరు గార్చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
6 నెలలలోపు ఇది సాధ్యపడేనా?
తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన మంచు విష్ణుని సదరు విలేఖరి ఈ విషయం అడగగా స్పందించాడు. మా భవంతిని నిర్మించేది నేనేనని, అది మరెవ్వరికీ సాధ్యపడదని ఒకింత గొప్పలు పోయాడు. అంతటితో ఆగకుండా, మరో 6 నెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాం! అంటూ విష్ణు ఝలక్ ఇచ్చాడు. అయితే ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే మా అసోసియేషన్ బిల్డింగ్ ని సాధ్యమైనంత తొందరగా నిర్మించేస్తామని చెప్పిన విష్ణు ఇప్పటి వరకు కనీసం పునాది రాయి వేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు మరోసారి మా భవంతిని మరో ఆర్నెళ్లలో కట్టేస్తామని అనడం ఒకింత విడ్డురంగా ఉందని టాలీవుడ్లో గుసగుసలు ఆడుకుంటున్నారు.