సినిమా

Sunny Leone: స‌న్నీ లియోన్‌తో మంచు విష్టు ఆట‌.. వీడియో చూస్తే న‌వ్వులే!

Share

Sunny Leone: బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌న్నీ లియోన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌న్నీ లియోన్ మ‌రో కీల‌క పాత్ర‌లో మెర‌వ‌బోతోంది.

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇందులో గాలి నాగేశ్వరరావు అనే డిఫ‌రెంట్ పాత్రలో మంచు విష్ణు క‌నిపించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

అయితే షూటింగ్ నుంచి బ్రేక్ దొర‌క‌గా మంచు విష్ణు స‌న్నీ లియోన్‌తో క‌లిసి ఓ ఆట ఆడాడు. ఈ గేమ్‌లో శివ‌ బాలాజీ కూడా పాల్గొన్నాడు. గేమ్ లో భాగంగా మంచు విష్ణు, స‌న్నీ, బాలాజీ వ‌ర‌స‌గా కూర్చొని ఉంటారు. మధ్యలో ఉన్న వ్యక్తు తన ఎడమ, కుడి ఉన్న వ్యక్తుల థైస్ ను కొడుతుంటే.. మిగిలిన ఇద్ద‌రూ ఆ వ్యక్తిని బాటిల్స్ తో ఆపాలి.

ఇందుకు సంబంధించిన వీడియోను స‌న్నీ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. సూప‌ర్ ఫ‌న్నీగా ఈ వీడియో నెటిజ‌న్ల చేత న‌వ్వులు పూయిస్తూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు ఆల‌స్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి.


Share

Related posts

Uppena : ఉప్పెన సినిమా డైరెక్టర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ..!!

sekhar

Kalyan ram : కళ్యాణ్ రామ్ – దిల్ రాజు – కెవి గుహన్ కాంబినేషన్‌లో న్యూ ప్రాజెక్ట్

GRK

Bavagaru bagunnara: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా మెగాస్టార్ చిరంజీవి చేసి భారీ హిట్ అందుకున్నారు..దానికి కారణాలు ఇవే

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar