Mangalavaram Trailer: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందరికీ సుపరిచితురాలే. అజయ్ భూపతి దర్శకత్వంలో “ఆర్ఎక్స్ 100” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. మొదటి సినిమాలోనే బోల్డ్ సీన్స్ లో లిప్ కిస్ లతో రెచ్చిపోయింది. దీంతో ఓవర్ నైట్ లోనే ఊహించని పాపులారిటీ లభించింది. కానీ “ఆర్ఎక్స్ 100” తర్వాత మళ్లీ ఆ తరహా హిట్ పాయల్ రాజ్ పుత్ అందుకోలేకపోవడం జరిగింది. ఇటువంటి క్రమంలో మరోసారి అదే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతినే నమ్ముకోవటం జరిగింది. తాజాగా వీరిద్దరి కాంబోలో “మంగళవారం” అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈసారి చాలా వైవిధ్యంగా పాయల్ నీ అజయ్ భూపతి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది.
విడుదలైన మంగళవారం ట్రైలర్ బట్టి చూస్తే హర్రర్ తో పాటు సూపర్ నేచురల్ సన్నివేశాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు నిమిషాలు అన్నిటికీ కలిగిన ఈ ట్రైలర్.. భయంతో పాటు ఉత్కంఠ భరితంగా.. కనిపించే సన్నివేశాలతో సాగింది. ఒక గ్రామంలో వింత సమస్య ఉన్నట్లు ప్రతి మంగళవారం గ్రామంలో ఎవరో ఒకరు చాలా దారుణంగా చనిపోవడం.. వంటి సన్నివేశాలు చూపించారు. పాయల్ రాజ్ పుత్ “ఆర్ఎక్స్ 100” సినిమాలో మాదిరిగా ఈ “మంగళవారం” చిత్రంలో కూడా బోల్డ్ సీన్స్ లో కనిపించింది. ఆమె పై దాడి జరిగినట్లు ట్రైలర్ లో చూపించారు.
గ్రామంలో భయంకరంగా మంగళవారం మరణాలు సంభవించడం.. మరోపక్క పాయల్ నీ అధికరాతకంగా అత్యాచారం చేసినట్లు ట్రైలర్ లో చూపించడంతో ఆమె దయ్యం అయ్యి పగ తీర్చుకుంటున్నట్లు ట్రైలర్ బట్టి జనాలు భావిస్తున్నారు. నవంబర్ 17వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పుకొచ్చింది. అయితే మెడిసిన్ తో నయమై అవకాశం లేదు సర్జరీ కంపల్సరీ అన్నారు. ఆ సమయంలో ఈ స్టోరీ వినడంతో సినిమా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు సర్జరీ చేయించుకోబోతున్నట్లు పాయల్ తెలిపింది. “మంగళవారం” అనే సినిమా చేయటం తాను వరంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.