అయ్యో కామెడీ చేసేశారే

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘మణికర్ణిక’. ఎన్నో వివాదాలు, విమర్శలని ఫేస్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం విజయమే సాధించింది. ఝాన్సీ రాణిగా కంగన చూపించిన నటనకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కంగనాకి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మణికర్ణిక మేకింగ్ సమయంలో షూట్ చేసిన ఈ వీడియోలో, ఒక ఎలెక్ట్రిక్ గుర్రంపై కంగనా కూర్చొని ఉంటే అది అచ్చం గుర్రం పోయినట్లే ముందుకు పోతుంది. కంగనా దాన్నే నిజంలా భావిస్తూ ఖడ్గవిన్యాసం చేస్తూ తెల్లదొరలపై పోరాటం చేస్తోంది. మణికర్ణిక సినిమాకే హైలైట్ గా నిలిచిన ఈ సీన్ ఇంత కామెడీగా తెరకెక్కించారా అని తెలుసుకున్న వారిలో కొంతమంది నవ్వుల్లో మునిగిపోగా మరికొంతమంది కంగనాని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.

అలా సోషల్ మీడియాలో కంగనాపై ట్రోలింగ్ మొదలైందో లేదో.. ఎప్పటిలానే ఇలా రంగోలి చందేల్ రంగంలోకి దిగింది. ట్రోలింగ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ “బుర్రలేని మనుషుల్లారా.. గెంతుతున్న గుర్రంపై స్వారీ చేస్తున్న వారి క్లోజప్ షాట్స్ ను ఎలా తీస్తారో మీకు తెలియదు.. దీన్ని మెకానికల్ హార్స్ అంటారు. ‘ది లాస్ట్ సమురాయ్’.. ‘బ్రేవ్ హార్ట్’.. ‘గ్లాడియేటర్’ లాంటి సినిమాల్లో వాడారు. ‘మణికర్ణిక’ లో కూడా దీన్ని క్లోజప్ షాట్స్ లో మాత్రమే వాడారు. బుర్ర లేని జనాలకు అసలు ఏమీ తెలీదు. డంబ్ గైస్” అంటూ సీరియస్ గా ట్వీట్స్ చేసింది. ఏది ఏమైనా సినిమాలో అంత పవర్ఫుల్ గా కనిపించిన సీన్ వెనక ఇంత కామెడీ ఉందా అని తెలుసుకున్న వాళ్లు మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.