RRR: ప్రపంచ సినిమా రంగంలో “RRR” సంచలనం సృష్టించింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇంకా ఓటీటీలో కూడా అనేక రికార్డులకు క్రియేట్ చేయడం జరిగింది. భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమా అందుకొని అంతర్జాతీయ అవార్డులు ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉంది. గ్లోబల్ అవార్డు గెలిచిన నాటినాటి సాంగ్.. ఆస్కార్ రేసులో ఉండటంతో కచ్చితంగా.. ఆస్కార్ గెలిచే అవకాశం ఉందని సినిమా ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే మార్చ్ నెలకి “RRR” విడుదలయ్యి ఏడాది కావడంతో అమెరికాలో స్పెషల్ షోస్ మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
దాదాపు అమెరికా దేశవ్యాప్తంగా 200 స్పెషల్ స్క్రీన్ లలో “RRR” రీ రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను దర్శకులను ఎంతగా ఆకట్టుకు ంది. అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కామరూన్ “RRR” చూసి రాజమౌళిని పొగడ్తలతో ముంచేతడం జరిగింది. అంతేకాదు రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్.. విదేశీయులని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి కూడా రాజమౌళి రెడీ అయినట్లు మీడియా ముఖంగా తెలియజేశారు. విదేశీ సినీ ప్రేమికులను ఎంతగానో ప్రభావితం చేసిన ఈ సినిమా వచ్చే మార్చి నెలకి విడుదలయ్యి ఏడాది కావస్తు ఉండటంతో… అమెరికాలో దాదాపు 200 స్క్రీన్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
వచ్చే నెలలోనే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం అమెరికాలో రామ్ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ షోలలో పాల్గొంటూ “RRR” సినిమాకి సంబంధించి.. వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.