Prabhas: డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే, ఆది పురుష్… సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడింటిలో వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు “ఆది పురుష్” విడుదల కానుంది. దీంతో డిసెంబర్ లేదా జనవరి మొదటి నెలలో ప్రభాస్ “ఆది పురుష్” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మరోపక్క మారుతి ప్రభాస్ తో చేయబోయే “రాజా డీలక్స్” సినిమా కోసం… బాలీవుడ్ హీరోని రంగంలోకి దింపుతున్నారట.
ఈ సినిమాలో ఇప్పటికే మాళవిక మేహానన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ప్రభాస్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మార్కెట్ ఉండటంతో నార్త్ ఇండియాకి చెందిన.. ఓ ప్రముఖ హీరోకి మారుతి కీలక రోల్ స్క్రిప్ట్ లో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మరి ఆ బాలీవుడ్ హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో ఈ సినిమాకి కేవలం 45 రోజులు కాల్ షీట్స్ మాత్రమే ప్రభాస్ ఇచ్చాడట. బంగ్లా లోనే సినిమా మొత్తం నడుస్తుందని అంటున్నారు.
అతి తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేయాలని పక్క ప్లానింగ్ తో షూటింగ్ రెడీ అవ్వాలని ప్రభాస్ ముందుగానే మారుతికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాలో క్యారెక్టర్లు రెడీ చేస్తున్న మారుతి.. ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోకి ఈ సినిమాలో పాత్ర సెట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కుదిరితే నవంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!