Tollywood Directors: మాస్ ని ఉర్రతలూగించే డైరెక్టర్స్ లో ముఖ్యంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ ముందుంటారు. మాస్ వర్గంలో వీరు తిరుగులేని డైరెక్టర్స్ అని వేరే చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డను తిరగరాసిన ఈ డైరెక్టర్స్ ఒక్క విషయంలో మాత్రం కాస్త వెనకబడే వున్నారని చెప్పుకోవచ్చు. సినిమాను అద్భుతంగా ఆవిష్కరిస్తున్న వీరు కొన్ని ఎలిమెంట్స్ మాత్రం డీల్ చేయలేకపోతున్నారు అని టాక్ వినబడుతోంది. ఇంతకీ ఏంటా ఎలిమెంట్స్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. ప్రజెంట్ సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా ట్రెండ్ ముమ్మురంగా నడుస్తోంది. దీంతో రొమాంటిక్ డ్రామాలను పక్కన పెట్టి మాస్ యాక్షన్ వైపు వెళుతున్నారు మన దర్శకులు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక పాన్ ఇండియా సినిమాలకి ఆజ్యం పోసిన రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు శృంగార రసాన్ని, అదే రొమాన్స్ విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్టు కనబడుతోంది. మన జక్కన్న ఛత్రపతి, విక్రమార్కుడు, ఈగ సినిమాల సమయంలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మీద కాస్త ఫోకస్ చేసాడు. కానీ బాహుబలి వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. రొమాన్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. నయా పాన్ ఇండియా సెన్సేషన్ ప్రశాంత్ నీల్ కూడా రొమాంటిక్ సీన్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నారనే చెప్పుకోవాలి మరి. ఈ విషయాన్ని తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓపెన్ ఒప్పేసుకున్నారు కూడా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక వీరితో పాటుగా పాన్ ఇండియా దర్శకుల కేటగిరిలో మన లెక్కల మాస్టారు సుకుమార్ చేరిపోయారు. బేసిగ్గా క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న మన సుక్కు భాయ్, ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాలతో మాస్ కోవలోకి చేరిపోయారు. అవును… ఒక్క పుష్ప పార్ట్ 1 తో హిందీ బెల్ట్ లో మంచి మార్కులు కొట్టేసారు. అయితే మన సుక్కు జక్కన్న, నీల్ లా కాకుండా కాస్త డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లెక్కల మేస్టారు మాస్ యాక్షన్స్ ఏ స్థాయిలో చూపిస్తున్నారో.. రొమాంటిక్ సీన్స్ కూడా అదే స్థాయిలో ప్రజెంట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన పుష్ప సినిమానే దానికి ఉదాహరణ. బన్నీ యాక్షన్స్ కి ఏ రేంజ్ అప్లాజ్ వచ్చిందో.. శ్రీవల్లి, పుష్పరాజ్ ల లవ్ యాంగిల్ కూడా అదే స్థాయిలో క్లిక్ కావడం మనం చూసాం.