29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ravi Teja: 2022 గురించి చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మాస్ మహారాజ రవితేజ..!!

Share

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ గత ఏడాది 2022 గురించి చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. “ధమాకా లాంటి మర్చిపోలేని సినిమాతో 2022కు వీడ్కోలు పలికాం. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సక్సెస్ ను 2022లో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం ఇస్తున్న. 2022 ఎంతో కష్టంగా గడిచింది. 2023లో అంతా మంచే జరగాలి” అని పోస్ట్ పెట్టడం జరిగింది. కాగా “ధ‌మాకా” సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా న‌టించింది.

Mass Maharaja Ravi Teja posted a very emotional post about 2022
Dhamaka Ravi Teja

“క్రాక్” సినిమా తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయిన రవితేజ “ధమాకా”తో అదిరిపోయే హిట్ అందుకోవటం జరిగింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ కొలగోడుతుంది. “ధమాకా” తొమ్మిది రోజుల్లో నైజాంలో ₹1.04 కోట్లు, సీడెడ్‌లో ₹39 లక్షలు, ఉత్తరాంధ్రాలో ₹22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో ₹7 లక్షలు, వెస్ట్ గోదావరిలో ₹4 లక్షలు, గుంటూరులో ₹5 లక్షలు, కృష్ణాలో ₹5 లక్షలు, నెల్లూరులో ₹3 లక్షలతో మొత్తంగా ₹1.89 కోట్లు షేర్, ₹3.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. రవితేజ కెరీర్ లో ఇది హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా “ధమాకా” దూసుకుపోతుంది.

Mass Maharaja Ravi Teja posted a very emotional post about 2022
Dhamaka Ravi Teja

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో రవితేజ నటించిన “వాల్తేరు వీరయ్య” ఈనెల 13వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమాలో కూడా రవితేజ చాలా పవర్ ఫుల్ రోల్ లో నటించడం జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత చిరంజీవితో మళ్లీ ఫుల్ లెన్త్ సినిమాలో రవితేజ నటించడంతో “వాల్తేరు వీరయ్య” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో రవితేజ మరియు చిరంజీవి ఈ వారం నుండి బీజీ కానున్నారు.


Share

Related posts

అఖిల్-మోనాల్ పెళ్ళి పై నోరు జారిన సోహెల్…! ముహూర్తమే మిగిలింది?

arun kanna

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Ram

పవన్ కల్యాణ్ , రజినీకాంత్ , షారూఖ్ ఖాన్ వీళ్ళంతా అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ముందు పిచ్చ లైట్ – ఎంతో తెలుసా !

Naina