Meena: హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినిమా రంగంలో సుమారు దశాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమా రంగాలలో అనేక సినిమాలు చేయటం జరిగింది. చిన్న వయసులోనే తెలుగు మరియు తమిళ సినిమాలు కూడా చేసింది. బాల నటిగా రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద స్టార్ హీరోల తో నటించింది. తర్వాత ఈ టాప్ హీరోలతోనే హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. రజనీకాంత్ తో నటించిన ముత్తు సినిమా మీనా కెరియర్ కి అత్యంత ప్లస్ అయింది. ఈ సినిమా జపాన్ దేశంలో భారీ విజయం సాధించడంతో అక్కడ కూడా ఈమెకు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పట్లో దక్షిణాది చలనచిత్ర రంగంలో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించింది.
తెలుగులో ఎక్కువగా వెంకటేష్ తో నటించింది. వెంకటేష్ మీనా జంటగా నటించిన సుందరకాండ, చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి. 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ నీ పెళ్లి చేసుకున్న తర్వాత నైనిక అనే కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే గత ఏడాది పోస్ట్ కోవిడ్ సమస్యలతో మీనా భర్త విద్యాసాగర్ మరణించడం జరిగింది. భర్త మరణంతో ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మీనా రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లు విపరీతంగా వార్తలు ఇటీవల రావడం ఎక్కువయ్యాయి. అయితే ఈ వార్తలపై మీనా కూతురు ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది. తన తల్లి పట్ల రెండో పెళ్లి అంటూ వస్తున్నా వార్తలను ఖండించింది.
ఇదే సమయంలో మీనా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ కాలా కూడా స్పందించడం జరిగింది. మీనా కి రెండో పెళ్లి గురించి అసలు ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం తన కూతురు భవిష్యత్తు పైన పెట్టినట్లు అందువల్లే మళ్ళీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుంటున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే మీనా తన తోటి హీరోయిన్స్ అప్పట్లో నటించిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉండటం ఆమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సినిమాలను మీనా ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో ఆమె అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. భర్త చనిపోయాక చాలా డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా చాలా కాలానికి మంచి నిర్ణయం తీసుకుందని హ్యాట్సాఫ్ అంటున్నారు.