Meera Jasmine: సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2003లో శివాజీ హీరోగా వచ్చిన `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీరా.. `భద్ర` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు ఈమె సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే హాట్ హాట్ ఫొటో షూట్లను సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తూ అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంటోంది.
ఇకపోతే మీరా జాస్మిన్ తాజాగా టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో `ది వారియర్` అనే సినిమా చేస్తున్న రామ్.. తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నాడని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మీరా జాస్మిన్ను బోయపాటి సంప్రదించారట. అయితే రోల్ బాగుండటంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసిందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.