నందమూరి బాలకృష్ణ నేడు 60వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. నిన్నటి నుంచే ఫ్యాన్స్ హడావుడి.. సంబరాలు మొదలయ్యాయి. బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా నుండి ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన టీజర్ తో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులకి మంచి సర్ప్రైజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పటి లాగే తమ అభిమాన హీరో బాలయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేశారు. కాని కరోనా వైరస్ కారణంగా బాలయ్య ఎలాంటి సంబరాలు వద్దని అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. కాని బాలకృష్ణ సడన్ గా సర్ప్రజ్ ఇచ్చి షాకిచ్చారు. ఫ్యాన్స్ కోసం బాలయ్యో ఈ సారి స్వయంగా వస్తున్నానంటూ ప్రకటించారు. బాలకృష్ణ ఈ రోజు పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో సందడి చేయబోతున్నారు. తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4:30 నిమిషాలకు లైవ్ కి రానున్నారు.
బాలయ్య ఇలా సోషల్ మీడియాలో అభిమానుల కోసం లైవ్ కి వస్తున్నారని తెలియడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్యని ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో బాలయ్య తన ఫ్యాన్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి. ఇక బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ పక్కా అని టిజర్ వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!