సినిమా

Mega 154: లీకైన `మెగా 154` టైటిల్.. మ‌స్తు ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌!

Share

Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేస్తున్న చిత్రాల్లో `మెగా 154` ఒక‌టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటోంది. రెండు రోజుల క్రిత‌మే శృతి హాసన్ కూడా షూట్‌లో జాయిన్ కాగా.. ప్ర‌స్తుతం చిరు, శ్రుతిల‌ మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. ఇంత‌కీ లీక్ చేసింది ఎవ‌రో కాదు.. ప్ర‌ముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌.

అవును, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. త‌న అప్ క‌మ్మింగ్ సినిమాల ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవిగారు న‌టిస్తున్న `వాల్తేరు వీర‌య్య‌`లో వ‌ర్క్ చేస్తున్నా అని పొర‌పాటు నోరు జారారు. వాస్త‌వానికి ఇప్పటివరకు `వాల్తేరు వీరయ్య` అని అభిమానులు అనుకోవడమే త‌ప్పా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు.

దీంతో కొత్త టైటిల్ వస్తుందేమో అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు చిత్ర టీమ్ ఏదైనా స్పెష‌ల్ తేదీన టైటిల్ అనౌన్స్ చేయాల‌ని చూస్తోంది. కానీ, ఈలోపే శేఖ‌ర్ మాస్ట‌ర్ `మెగా 154` టైటిల్ వ‌ల్తేరు వీర‌య్య అని క‌న్ఫామ్ చేసేయ‌డంతో.. మెగా ఫ్యాన్స్ మ‌స్తు ఖుషీ అయిపోతున్నారు. కాగా, పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.


Share

Related posts

సమంత.. చైతు పిల్లలని కనకపోవడానికి కారణం అదేనట!

Teja

బీజేపీలోకి సీనియ‌ర్ హీరోయిన్‌

Siva Prasad

ఇలియానాని ఇంత దారుణంగా అడుగుతారా ..?

GRK