గత నెలరోజుల క్రిందట మెగా బ్రదర్ నాగ బాబు తనయ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే. నిహారిక పెళ్లి కోసం మెగా కుటుంబ సభ్యులందరూ మూడు రోజుల పాటు ఒకే చోట చేరి ఎంతో సంతోషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక వివాహ అనంతరం వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్ కరోనా బారిన పడటంతో కొంతవరకు ఆందోళన చెందిన ఈ కుటుంబం తరువాత ఈ హీరోలిద్దరూ తొందరగా కోలుకోవడంతో ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా వారు నలుగురు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే నిహారిక పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించిన నాగబాబు కుటుంబంలో త్వరలోనే మరో పెళ్లి బాజా మోగనున్నట్లు సమాచారం. తొందరలోనే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి వరుణ్ తేజ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, తనతోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే వరుణ్ తేజ్ ప్రేమించిన అమ్మాయికి ఎవరు? ఏమిటి? అనే విషయాల గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ సమయంలో కుటుంబమంతా కలిసి సెల్ఫీ దిగారు.ఆ ఫోటోలో వరుణ్, నాగబాబు, నిహారిక, పద్మజా ఎంతో సంతోషంగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ, హ్యాపీ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయటంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.