Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఇటీవల కొద్దిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా కూడా ఉంటూ వస్తున్నారు. గతంలో జబర్దస్త్ ఇంకా పలు టెలివిజన్ షోలలో నాగబాబు ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో జనసేన పార్టీ కార్యక్రమాలలో కీలకంగా రాణిస్తున్నారు. మరోపక్క కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే టీ వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య ఇంకా ప్రేమికుల మధ్య.. బ్రేకప్స్ ఎక్కువ అయిపోతున్నాయి.
పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకు లేదా నెలలకు వారాలకు ఇటీవల కాలంలో రోజులలో కూడా విడిపోయిన జంటలు ఉన్నాయి. అయితే ఈ బ్రేకప్స్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటి జనరేషన్ లో చాలా వరకు సర్దుకుని తత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రేకప్ లే వినిపిస్తున్నాయి.. దీనికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా నాగబాబు సంచలన సమాధానం ఇచ్చారు. ప్రస్తుత జనరేషన్ లో అబ్బాయిలు ఒక మైండ్ సెట్ నుంచి పూర్తిగా ఎదగలేకపోతున్నారు. మరొక ఆడపిల్లవేమో చిన్నప్పటినుంచి పెద్ద వారిని చూసి మీరు ఎందుకు సర్దుకుని ఉన్నారు నేనెందుకు సర్దుకోవాలి అనే ప్రశ్న వేస్తున్నారు.
కాబట్టి భార్యాభర్తలిద్దరూ సమానంగా సంపాదిస్తున్నప్పుడు లేదా తనకంటే ఎక్కువ చదువుకున్న సంపాదించిన ఆడపిల్లలలో మేమెందుకు సర్దుకోవాలి ఆ మీద వాళ్ళు ఎందుకు అధికారం చాలా ఇస్తారు అని ఆలోచన వస్తూ ఉంది. ఎప్పుడైతే ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని చూస్తారు ముఖ్యంగా భార్యలను కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పుడే.. విడిపోయే పరిస్థితులు బ్రేకప్ లు జరుగుతున్నాయి అని నాగబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే ఈ కామెంట్స్ పట్ల సోషల్ మీడియాలో కొందఱు నెటిజెన్స్ పరోక్షంగా మాజీ అల్లుడు నిహారిక మాజీ భర్త చైతన్య జోన్నలగడ్డనీ ఉద్దేశించి నాగబాబు కామెంట్స్ ఉన్నాయ్ అని అంటున్నారు.