గత ఏడాది డిసెంబర్ 9న నాగబాబు ముద్దుల తనయ వివాహం అంగరంగ వైభవంగా ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు, అల్లు ఫ్యామిలీ కలిసి ఎంతో ఆనందంగా గడిపిన సంగతి మనకు తెలిసిందే. నిహారిక పెళ్లి కి సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.అయితే మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు పూర్తవ్వగానే మెగా అభిమానులు ఇక వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
ఇకపోతే వరుణ్ తేజ్ పెళ్లి విషయంపై తాజాగా నాగబాబు స్పందించారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ పెళ్లి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వని నాగబాబు తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. నా కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతని పెళ్లి విషయంలో కేవలం అమ్మాయి వరుణ్ తేజ్ కి సరిజోడినా కాదా అన్నది మాత్రమే చూస్తామంటూ…నాగబాబు వరుణ్ పెళ్లి గురించి స్పష్టత ఇచ్చాడు.
తాజాగా వరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించాడని, తనని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ వరుణ్ ప్రేమ విషయం గురించి అయితే మెగా కుటుంబం ఏ విధంగాను స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న” గని” అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 అనే సినిమాలో నటిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!