Charan Bunny: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ మరియు చిరంజీవి పోటీ పడటం తెలిసిందే. ఒక్కరోజు వ్యవధిలో వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదట బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” ఆ తర్వాత చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” రిలీజ్ అయ్యాయి. రెండు కూడా విజయం సాధించడం జరిగింది. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతి పండుగకు చరణ్ వర్సెస్ బన్నీ పోటీకి సిద్ధమైనట్లు వార్త వస్తుంది. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో శరవేగంగా జరిగింది.

కానీ మధ్యలో అనుకోకుండా “ఇండియన్ 2” సినిమా షూటింగ్ రీస్టార్ట్ కావటంతో.. RC 15 షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ మూవీ. అయితే సంక్రాంతి పండుగ దిల్ రాజుకి కలిసివచ్చే సీజన్ కావటంతో… “RC 15” ఆ టైంలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో నేషనల్ ఇమేజ్ బన్నీ సొంతం చేసుకోవడం తెలిసిందే. దీంతో “పుష్ప 2” చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా కోసం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సినిమా ప్రేమికులు ఎదురుచూస్తూ ఉన్నారు. 2021లో “పుష్ప” రిలీజ్ అయ్యి ప్రపంచ స్థాయిలో… ఓ రేంజ్ లో అలరించడం జరిగింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో దాదాపు ఏడాది టైం తీసుకున్న సుకుమార్ ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశారు.

అయితే ఈ సినిమాని జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలని డిసైడ్ కావడం జరిగిందట. అంతేకాదు “పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం మరిన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయటం జరిగింది. అయితే సంక్రాంతి పండుగకు చరణ్ మరియు బన్నీ ఒకేసారి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి డిసైడ్ కావటం..తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇద్దరికీ పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చిన తొలినాళ్లలోనే పోటీ పడటం.. అంత మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే సంక్రాంతికి చరణ్ మరియు బన్నీ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది.