సినిమా

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ పై మెగా హీరో ప్ర‌శంస‌లు.. ఇక యంగ్ హీరో వెన‌క్కి త‌గ్గ‌డు!

Share

Vishwak Sen: విశ్వ‌క్ సేన్‌.. గ‌త మూడు రోజుల నుంచీ ఈ పేరు అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న త‌న తాజా చిత్ర‌మైన `అశోకవనంలో అర్జున కళ్యాణం` ప్ర‌మోట్ చేయ‌డం కోసం రోడ్డు ప‌క్క‌న ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు. ఈ వీడియోపై ప్ర‌జ‌లు కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓ మీడియా సంస్థ ప్ర‌య‌త్నం చేసింది.

కానీ, వారి ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. స‌ద‌రు మీడియా యాంక‌ర్ దేవీ నాగవల్లి.. విశ్వ‌క్ సేన్‌ను స్టూడియోకి పిలిచి మ‌రీ అవ‌మానించింది. దాంతో విశ్వ‌క్ సైతం కోపాన్ని అదుపు చేసుకోలేక `ఎఫ్‌**` అని నోరు జారాడు. దీంతో విశ్వక్ సేన్ వ‌ర్సెస్ టీవీ యాంకర్ దేవీ నాగవల్లి వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదంలో విశ్వ‌క్ సేన్‌కే ఎక్కువ శాతం మంది స‌పోర్ట్ చేస్తూ దేవీ నాగ‌వ‌ల్లిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

సినీ ప్ర‌ముకులు సైతం విశ్వ‌క్‌కు అండ‌గా నిలుస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో మెగా హీరో, చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ విశ్వ‌క్ సేన్ మ‌రియు అత‌డి తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణంపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా ప్రీవ్యూ చూసిన ఆయ‌న `ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎంటర్టైన్‌మెంట్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఎంత‌గానో అల‌రించాయి.

అర్జున్ కుమార్ అల్లం పాత్రలోకి విష్వక్ మారిపోయిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది` అంటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశారు. దీంతో విశ్వ‌క్‌కు మెగా మ‌ద్ద‌తు కూడా ల‌భించిన‌ట్టైంది. ఈ నేప‌థ్యంలోనే ఇక యంగ్ హీరో వెన‌క్కి త‌గ్గ‌డనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


Share

Related posts

బ్రేకింగ్: నిహారిక, చైతన్యల నిశ్చితార్ధానికి చిరు, చరణ్

Vihari

సాయి ధరం తేజ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు .. అందుకే ఏమాత్రం తగ్గడం లేదు ..!

GRK

RRR: ఇండియాలో రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar