నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా “బింబిసారా” ఆగస్టు 5వ తారీఖు విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వంశీ వశిష్ట అనే కొత్త దర్శకుడు సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల థియేటర్లకు జనాలు రావడం లేదని ప్రచారం గట్టిగా జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో విడుదలైన బింబిసారా, సీతారాం రెండు విడుదలయ్యి విజయాలు సాధించటం తో పాటు థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి.
ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాల విజయం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బింబిసారా విజయం సాధించడం పట్ల సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఉరాటని మరింత ఉత్సాహాన్ని ఇస్తూ… కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం.
ఈ సందర్భంగా “సీతారామం” మరియు “బింబీసారా” చిత్రాల నటీనటులకు మరియు నిర్మాతలకు సాంకేతిక నిపుణులందరికీ మన పూర్వక శుభాకాంక్షలు. మరో మెగా హీరో బన్నీ కూడా అభినందించారు. “బింబీసార టీంకి బిగ్ కంగ్రాట్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫాంటసీ చిత్రం. కళ్యాణ్ రామ్ గారు చక్కగా నటించారు. ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం చేస్తున్నందుకు, కొత్త తరహా సినిమాలు తీసుకొస్తూన్నందుకు ఆయనంటే గౌరవం. మొదటి సినిమా తీసిన డైరెక్టర్ వశిష్ట చక్కగా హ్యాండిల్ చేశాడు. అని వయసుల వారిని “బింబిసార” ఎంటర్ టైన్ చేస్తుంది” అని పొగడ్తల వర్షం కురిపించారు.