Chiranjeevi: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా తర్వాత సినిమాతో మాంచి ఊపు మీదున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ తనయుడు చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య సినిమాను కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయాలనుకున్నారు. దీనికి తగ్గట్తే దర్శకుడు కొరటాల శివ కూడా పక్కాగా ప్లాన్ చేశారు. అయితే, కరోనా గట్టి దెబ్బకొట్టింది. ఏకంగా ఈ సినిమాకు సమయం దాదాపు రెండేళ్ళు పట్టింది.
ఇక ఆచార్య చిత్రం విడుదలకు ముందే చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను కూడా సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. ఇక ఈ రెండు చిత్రాలతో పాటుగా యువ దర్శకుడు బాబీ రూపొందించే సినిమానూ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా తెగ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. ఇందులో చిరుకు తమ్ముడిగా కనిపించబోతున్నారు.
Chiranjeevi: ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న భారీగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
కాని, తాజగా మరో టైటిల్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అలాగే, ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మెగాస్టార్ – బాబీ చిత్రానికి వాల్తేరు మొనగాడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. కరోనా నుంచి కోలుకున్న మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే, భోళా శంకర్, బాబీ చిత్రాల షూటింగ్‌లోనూ చిరంజీవి పాల్గొనడానికి షెడ్యూల్స్ రెడీ చేయమని దర్శక, నిర్మాతలకు చెప్పారట. కాగా, ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న భారీగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.