Varun Tej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “ఆర్ఆర్ఆర్” లో అల్లూరి సీతారామరాజు పాత్ర లో స్క్రీన్ చించేసాడు అన్న సంగతి తెలిసిందే. చెర్రీ నటనకు ఇండస్ట్రీలో మహామహులు ఫిదా అవుతున్నారు. తారక్ లాంటి ఫుల్ ఎనర్జీ కలిగిన అతడి తో సమానంగా.. చెర్రీ నటన “ఆర్ఆర్ఆర్” విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎక్కడా కూడా ఎన్టీఆర్ తో తగ్గకుండా నువ్వా నేనా అన్నట్టుగా చరణ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇంట్రడక్షన్ సన్నివేశంలో అయితే థియేటర్ లో ప్రేక్షకులను జాతర చేయించలా.. అన్న విధంగా.. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ ఫుల్ హడావిడి చేయడం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు భారీ ఎత్తున రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు జరిపారు. కదా శిల్పకళావేదికలో జరిపిన ప్రత్యేక వేడుకలలో.. ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెహర్ రమేష్.. అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ..’ చిన్ననాటి నుండి చరణ్ అన్న నన్ను బాగా ఏడిపించేవారు.
చరణ్ అంటే భయపడేవాడిని. కానీ చిరుత సినిమా చూసిన తర్వాత.. పెదనాన్న చిరంజీవి గారి లో ఉన్న మెచ్యురిటీ… చరణ్ అన్నయ్య లో చూశాను. నా అన్న అని చెప్పడం లేదు… చరణ్ అన్న లాంటి గొప్ప వ్యక్తులు.. చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అన్నకు తమ్ముడి గా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సాధారణంగా బర్త్‌డేకు మేము గిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఈసారి అల్లూరి సీతారామరాజు పాత్రతో మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ అన్న ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. చరణ్ అన్నను ఎవరైనా నోరెత్తి ఒక మాట అనాలంటే మీరందరితోపాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి. తర్వాత ఆయనతో మాట్లాడొచ్చు’ అంటూ చెర్రీని విమర్శించేవాళ్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు వరుణ్ తేజ్. ఇదిలా ఉంటె “గని” ప్రీ రిలీజ్ వేడుకకి బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారట.