Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే..! 109 రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు

mega star chiranjeevi birthday celebrations
Share

Chiranjeevi: చిరంజీవి Chiranjeevi మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్, ప్రేక్షకుల అభిమానం స్థాయి ఏంటో ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు. వారే చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరిస్తున్నారు. అటువంటి అభిమానులను ప్రజాసేవ వైపు మళ్లించారు చిరంజీవి. 1998లో చారిటబుల్ ట్రస్టు స్థాపించి వారిని సేవా కార్యక్రమాల వైపు నడిపించారు. అలాంటి అభిమానులు మరి తమ హీరో పుట్టినరోజు వస్తుందంటే హడావిడి ఏలా చేస్తారో కదా. మరో 109 రోజుల్లో ఆ సంబరం కూడా రానుంది. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సండర్భంగా ‘అఖిల భారత చిరంజీవి యువత’ ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టింది.

mega star chiranjeevi birthday celebrations
mega star chiranjeevi birthday celebrations

నేటి నుంచి చిరంజీవి పేరు మీద సేవా కార్యక్రామలకు శ్రీకారం చుట్టారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాల్లో ఈరోజు (మే 6, గురువారం) చిరంజీవి పేరు మీద పూజా కార్యక్రమాలు జరిపించి సంబరాలను ప్రారంభించారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సేవా మహోత్సవాలు-2021’ గా ఆగష్టు 22 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఇప్పటికే చిరంజీవి ఇచ్చిన పిలుపుతో ప్లాస్మా దానం కూడా చేపట్టబోతున్నారు. అవసరమైన వారికి అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలను కూడా చేయడానికి రాష్ట్ర చిరంజీవి యువత సమయాత్తమవుతోంది.

ప్రతి ఏటా 100 రోజుల ముందు నుంచే చిరంజీవి జన్మదిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతేడాది సీసీసీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి కార్మికులకు రెండు నెలలపాటు నిత్యావసరాలు అందించారు చిరంజీవి. ప్రస్తుతం కార్మికుల కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తున్నారు. చిరంజీవి చేపడుతున్న కార్యక్రమాల మాదిరిగానే ఆయన అభిమానులు కూడా చిరంజీవి పిలుపుతో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి మెగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడమే కాదు.. ఎందరో ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూండటం విశేషం.

 


Share

Related posts

బిగ్ బాస్ 4 : షాక్..! ఇంటిలో మరో కొత్త జంట..? సడన్ గా ప్రపోజ్ చేసేశాడే..

Teja

దేవీని టార్గెట్ చేసిన త‌మ‌న్‌?

Siva Prasad

జబర్దస్త్ ఇక ఆపేయాల్సిందేనా…? లేదా వీళ్ళు నిజంగానే కాపాడుతారా?

arun kanna