Mega Daughters : సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇంటి నుంచి ఎంతో మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఇక చిరంజీవి కుటుంబం విషయానికి వస్తే చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మెగా కుటుంబంలోని వారసులు మాత్రమే కాకుండా వారసురాలు కూడా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకుంటున్నారు.ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా వెండితెరపై సందడి చేస్తోంది. అదేవిధంగా చిరంజీవి కూతుర్లు తెరవెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా ఏదైనా పండుగలు, ప్రత్యేక రోజులు వచ్చినప్పుడు మెగా కుటుంబం కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పండుగ అయిన కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సరదాగా గడిపి పండుగలను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మహా మహా శివరాత్రి పండుగను మెగా కుటుంబం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా చిరంజీవి తన కొడుకు కోడలు, కూతుళ్ళు అల్లుళ్ళతో కలిసి శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
సంప్రదాయంగా ముస్తాబైన చిరు కూతుర్లు:
శివరాత్రి పండుగను పురస్కరించుకొని చిరంజీవి కూతుర్లు సుస్మిత ,శ్రీజ ఎంత సాంప్రదాయబద్దమైన చీరలను ధరించి ఎంతో అందంగా ముస్తాబు అయ్యారు. చీర కట్టుకొని షేడ్స్ పెట్టుకొని ఎంతో అందంగా తయారైన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి మెగా అభిమానులను ఆకట్టుకుంది. ఇక కెరీర్ పరంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగిస్తోంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అదేవిధంగా రామ్ చరణ్ తేజ్ సినిమాలో కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తారు. కేవలం వారి ఇంటిలోని వారికి మాత్రమే డిజైనర్ గా కొనసాగిస్తున్నారు. ఇక శ్రీజ తన భర్త హీరోగా తనే సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. ఎట్టకేలకు మెగా కూతుర్లు కూడా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు.