Varun Tej: ఈసారి మెగాస్టార్ ఉండాల్సిందే..లేకపోతే వరుణ్‌కు కష్టమే..? అని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. దానికి కారణం గని సినిమానే. ఇటీవల వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. నిజానికి వరుణ్ కెరీర్లో ఇంత భారీ ఫ్లాప్ ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. మొదటి సినిమా ముకుంద నుంచి మెగా ఫ్యామిలీలో కాస్త డిఫరెంట్ జోనర్ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు వరుణ్ తేజ్. కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 సిరీస్..ఇలా మంచి కథలను ఎంచుకుంటున్నాడు.
ఒక సినిమాకు మరొక సినిమాకు వైవిధ్యం చూపిస్తున్నాడు. అలా చేసిందే గని సినిమా కూడా. కానీ, ఈ సినిమా కథ, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం..మ్యూజిక్ కూడా అసలు కుదరకపోవడం..ఇలా అన్నీ కలిసి వరుణ్ తేజ్‌కు ఫ్లాప్ వచ్చేలా చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన గని సినిమా కోసం వరుణ్ తేజ్ దాదాపు మూడేళ్లు చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం సున్నా. ఇక ఈ సినిమా విషయంలో మెగాస్టార్ ఏమాత్రం కలుగజేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది.
Varun Tej: అలాంటి కథ ఉంటే చెప్పమని దర్శకులకు మెగాస్టార్ చెప్పారా..?
అల్లు అరవింద్ సమర్పణలో ఆయన పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మించిన సినిమా కావడంతో గని సినిమా బాధ్యతలన్నీ ఆ కాంపౌండ్ వారే చూసుకున్నారు. సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ కూడా అల్లు ఫ్యామిలీనే చూసుకుంది. అయితే, గని రిజల్ట్ మెగా ఫ్యామిలీని తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే, ఇప్పుడు వరుణ్ కోసం పక్కా మాస్ ఎంటర్టైనర్ కథను వెతుకుతున్నారట. అలాంటి కథ ఉంటే చెప్పమని దర్శకులకు మెగాస్టార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సారి కథ విని ఫైనల్ చేసినప్పటి నుంచి రిలీజయ్యే వరకూ అన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని డిసైడయారట. మరి వరుణ్ ఈసారి ఎలాంటి కథతో వస్తాడో దర్శకుడెవరో చూడాలి.