Mega family: అపుడెపుడో ఆడియో ఫంక్షన్లో మొదలైన ఘటన నేటికీ కొనసాగుతుందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. అవును… అదేమిటో ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో మొదలైన ‘మెగా vs అల్లు’వారి ఫ్యాన్స్ గొడవల ప్రస్థానం ఇంకా కొనసాగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరొకసారి అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ముదురుతున్నాయి. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లోనే కాకుండా ఇప్పుడు అభిమాన సంఘాల మీటింగ్స్ లో కూడా ఊహించని విధంగా మాటల యుద్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mega family: ‘మెగా vs అల్లు’వారి ఫ్యాన్స్ గొడవలు:
మెగా vs అల్లు అర్జున్ కు సంబంధించిన అనేక రకాల గొడవల పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మిగతా అభిమానుల నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కొన్ని నెగిటివ్ ట్యాగ్స్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ గొడవ కు కారణాలు ఏంటి? ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోని అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వాతావరణం తెలుగు ప్రాంతాలను కూడా తాకింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య లో ఊహించని విధంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏం పీకలేరు బ్రదర్?
సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన నెగిటివ్ ట్యాగ్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ‘ఏం పీకలేరు బ్రదర్’ అని ట్యాగ్ అయితే గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే మాటను ఏ విధంగా హైలెట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పటినుంచి ఈ లైన్ అయితే నెగిటివ్ విషయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇప్పుడు అభిమానుల మధ్యలో కూడా ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే ట్యాగ్ హాట్ టాపిక్ గా మారిపోయింది.