NewsOrbit
Entertainment News సినిమా

Rangamarthanda: “రంగమార్తాండ” సినిమాపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..!!

Share

Rangamarthanda: ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగమార్తాండ” విడుదల కావడం జరిగింది. మరాఠీ సినిమా “నటసామ్రాట్” కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాని చూసిన చాలామంది తెలుగు సినిమా నటీనటులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని చెప్పుకోచ్చారు.

Megastar Chiranjeevi Emotional Post On Rangamarthanda Movie

ఇటువంటి సినిమాలు అందరూ ఆదరించాలని.. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ” రంగమార్తాండ చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఈచిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్.. ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు.. హాస్యబ్రహ్మానందం కలయిక.. వారి పనితనం.. ఆ ఇద్దరి అద్భుతమైన నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి పెట్టించింది.

Megastar Chiranjeevi Emotional Post On Rangamarthanda Movie

ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ స్వయంగా బ్రహ్మానందంని సత్కరించడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాకి చిరంజీవి తన వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. “రంగమార్తాండ” చూసిన చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర ప్రతి ఒక్కరు గుండెను పిండేసేటట్టు ఉంటుందని అద్భుతంగా.. కృష్ణవంశీ తెరకెక్కించినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Share

Related posts

Allu Arjun: మరోసారి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ స్క్రిప్ట్ బ్లాక్ చేసిన బన్నీ..??

sekhar

Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ప్రీ రిలీజ్ వేడుకలో మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న సినిమా యూనిట్..!!

sekhar

Rakul: సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ర‌కుల్ క్లీవేజ్ షో.. కుర్రాళ్ళు ఏమైపోతారో!

kavya N