Entertainment News న్యూస్ సినిమా

సొంత ఊరు అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్ చిరంజీవి..!!

Share

తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిత్వం చిరంజీవి సొంతం. చిరంజీవి ఎదుగుతున్న సమయంలో అప్పటికే టాప్ హీరోలుగా రాణించిన ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ కొడుకులు ఉన్నాగాని చిరంజీవి తన నటన ప్రతిభతో రామారావు తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనాన్ని అధిరోహించి దాదాపు 30 దశాబ్దాల పాటు ఇండస్ట్రీ రారాజుగా వెలిగారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి టాప్ హీరోగా రాణిస్తున్న సమయంలో ఆయన వేసిన స్టెప్పులు చేసిన ఫైట్లు.. భారతీయ చలన చిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాయి.

Megastar Chiranjeevi fulfilled the last wish of his hometown fan..!!

ఇండియాలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో సమాజానికి మేలు చేకూరే దిశగా రక్తదానం విషయంలో బ్లడ్ బ్యాంక్ తో పాటు చిరంజీవి ఐ బ్యాంకు కూడా స్థాపించడం జరిగింది. వీటి ద్వారా అనేక మంది జీవితాలను కాపాడిన చిరంజీవి.. రాజకీయరంగంలో అడుగుపెట్టి విఫలమయి మళ్లీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కష్ట కాలంలో అనేక సహాయ కార్యక్రమాలు ఇండస్ట్రీలో మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చిరంజీవి.. తనను ప్రేమించే అభిమానుల విషయంలో కూడా తన దయ హృదయం చాటుతూ ఉంటారు.  అభిమానులకు మరింత దగ్గరగా ఈ రెండు సంవత్సరాల కాలంలో చిరంజీవి అనేక సహాయ కార్యక్రమాలు చేశారు.

Megastar Chiranjeevi fulfilled the last wish of his hometown fan..!!

ఈ క్రమంలో తాజాగా తన సొంత ఊరు మొగల్తూరు కి చెందిన తన అభిమానికి చిరంజీవి చివరి కోరిక తీర్చడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఏపీలో మొగల్తూరు కి చెందిన చిరంజీవి అభిమాని నాగరాజుకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో తన చివరి కోరికగా … తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుకున్నాడు. అయితే నాగరాజు పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి వెంటనే తనని హైదరాబాదులో తన నివాసానికి పిలిపించుకుని అతని కోరిక తీర్చారు. అతనితో చాలాసేపు మాట్లాడటం మాత్రమే కాదు మానసిక స్థైరంతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు. దీంతో నాగరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిరంజీవిని కలవడానికి నాగరాజుతో పాటు అతని భార్య కూడా రావడం జరిగింది. అభిమాని చివరి దశలో పరిస్థితి ఉన్న సమయంలో చిరంజీవి ఈ రీతిగా రియాక్ట్ కావటం పట్ల మెగా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

Viveka Murder Case: దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

somaraju sharma

వ్యాపారాభివృధి కలగాలన్న, ఆర్ధిక సమస్యలు పోవాలన్నా ఇలా చేసిచూడండి!!

Kumar

Congress: యూపీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ కు దిమ్మ‌తిరిగిపోయే షాక్

sridhar