సినిమా

Chiranjeevi: తన డ్రీమ్ హీరోయిన్ రాధికకు బంపర్ అఫర్ ఇచ్చిన మెగాస్టార్.. ఆనందంలో రాధికా శరత్ కుమార్!

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, అలనాటి రాధిక శరత్ కుమార్ పరిచయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వారిది అప్పట్లో మంచి జోడి. వారు కలిసి నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్టే. ఈ క్రమంలో వారి స్నేహం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాధిక-మెగాస్టార్ కుటుంబానికి వున్న సంబంధం గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాధిక భర్త శరత్ కుమార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘నేను ఆర్ధికంగా ఇబ్బందులు పడినపుడు చిరంజీవి ఓ సినిమా అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయనతో చేసిన సినిమా వలన మరలా నిలదొక్కుకున్నాం!’ అని చెప్పారు.

 Megastar Chiranjeevi gives bumper offer to his dream heroine Radhika
Megastar Chiranjeevi gives bumper offer to his dream heroine Radhika

తాజాగా మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరు!

ఇపుడు అదే మెగాస్టార్ అదే రాధిక శరత్ కుమార్ కు ఓ సినిమా చేస్తానని చెప్పడంతో వారు ఫుల్ జోష్ లో వున్నారు. ఇకపోతే చిరు తాజాగా ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్లు మాత్రం ఇప్పటికే 70 క్రోర్స్ దాటిపోయాయి. తరువాత ఆయన 3 చిత్రాల్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వెంకకీ కుడుముల, మారుతి లాంటి దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి లైన్ లో ఉన్నారు. వీటికి తోడు మరో 5 కథలు రెడీ అవుతున్నట్టు ఆయనే ఇటీవల చెప్పారు. ఇవి లైన్ లో ఉండగానే చిరు ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేయడం విశేషం.

 Megastar Chiranjeevi gives bumper offer to his dream heroine Radhika
Megastar Chiranjeevi gives bumper offer to his dream heroine Radhika

ఈ బేనర్లోనే చిరు – రాధిక సినిమా!

చిరు, రాధికల మధ్య ఎప్పటి నుంచో మంచి రిలేషన్ కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీలో రాధికను ఒక మెంబర్‌లా ట్రీట్ చేస్తారు. ఈ నేపథ్యంలో రాధిక ట్వీట్ చేస్తూ… ‘డియర్ చిరంజీవి! త్వరలో మా ‘రాడాన్ మీడియా వర్క్స్’ బ్యానర్ లో మీరో ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో ఓ బ్లాక్ బస్టర్ తీయడానికి ఎదురు చూస్తున్నాను’.. అంటూ రాధిక ట్వీట్ చేయడం విశేషతను సంతరించుకుంది. రాడాన్ బ్యానర్ లో ఇప్పటి వరకూ రాధిక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ తీశారు. అలాగే ఆ బ్యానర్ లోనే తమిళంలో అరడజను సినిమాల వరకూ నిర్మించారు.


Share

Related posts

ఆస్ట్రియాలో `సాహో` సాంగ్ షూట్‌

Siva Prasad

స్పెషల్ గెస్ట్ పై ముద్దుల వర్షం కురిపించిన ప్రియమణి..! ఢీ షో లో ఆది కి అవమానం

arun kanna

Intinti Gruhalakshmi: ప్రేమ్ బర్త్ డే సెలబ్రేషన్స్ తులసి చేతుల మీదగా.. అదిరిపోయే స్కెచ్ వేసిన లాస్య..!

bharani jella