Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరికొద్ది రోజుల్లోనే మలేషియాకు పయనం కాబోతున్నారట. అయితే వృత్తిపరంగానే ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `ఆచార్య`తో ప్రేక్షకులను పలకరించి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడిన చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు.
ఈయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `మెగా 154` ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ మూవీ నిర్మితమవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వాల్తేర్ సముద్ర తీరం నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతోంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొంత షూటింగ్ పూర్తి కాగా.. తదుపరి షెడ్యూల్‌కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మలేషియాలో జరగనుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 6 నుంచి స్టార్ట్ కాబోతోంది.. ఇందులో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
అందుకారణంగానే చిరంజీవి చిత్ర టీమ్‌తో కలిసి మలేషియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించనున్నారని.. మరికొద్ది రోజుల్లో ఆయన షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…